ప్రియుడే హంతకుడు.. జ్యోతి హత్య కేసు విచారణలో తేల్చిన పోలీసులు!

  • సోమవారం ప్రియుడితో కలసి వెళ్లిన జ్యోతి 
  • జ్యోతి మృతదేహానికి రీ పోస్టుమార్టం 
  • తలపై గాయం చేసుకున్న శ్రీనివాసరావు
మంగళగిరి పరిధిలో హత్యకు గురైన జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె ప్రియుడు శ్రీనివాసరావే ఆమెను హత్య చేసినట్టు పోలీసుల విచారంలో తేలింది. గత సోమవారం శ్రీనివాసరావుతో కలిసి మంగళగిరి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన జ్యోతి హత్యకు గురైంది. జ్యోతిని శ్రీనివాసరావే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆమె మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం చేయించారు.  

పోలీసుల విచారణలో జ్యోతిని చంపింది ఆమె ప్రియుడేనని తేలింది. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని నిలదీయంతో పక్కా ప్లాన్‌తో హత్య చేశాడని నిర్ధారణ అయింది. దుండగుల దాడిలో జ్యోతి చనిపోయిందని నమ్మించేందుకే శ్రీనివాసరావు తలపై గాయం చేసుకున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును ఎస్పీ విజయరావు స్వయంగా విచారించడంతో కేసు మిస్టరీ వీడింది. జ్యోతి హత్య విషయంలో శ్రీనివాసరావుకు మరో ఇద్దరు స్నేహితులు సహకరించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Jyothi
Srinivasa Rao
Murder Case
Amaravathi
Vijaya Rao

More Telugu News